Tech News - Rock Star Computers

Breaking

Computer Hardware&Networking,Photoshop,Ms Office,Electronics,Electrical


Tech News

News » రానున్న రోజుల్లో వైఫై నెట్‌వర్క్ నుంచే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.. రానున్న రోజుల్లో వైఫై నెట్‌వర్క్ నుంచే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు..



నెట్‌వర్క్ సరిగ్గా లేనపుడు కాల్స్ చేసుకోవటనేది దాదాపుగా కష్టతరంగా మారిపోతుంది. ఇటువంటి సందర్భాల్లో వై-ఫై కనెక్టువిటీ అందుబాటులో ఉన్నప్పటికి కేవలం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ కాల్స్ మాత్రమే చేసేకునే వీలుంటుంది. ఈ సౌకర్యాన్ని వాట్సాప్, టలిగ్రామ్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీసులు ఆఫర్ చేస్తున్నప్పటికి అవతలి వ్యక్తి వద్ద ఇవి అందుబాటులోలేకపోయినట్లయితే వై-ఫై కనెక్టువిటీ ఉన్నప్పటికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాల్ డ్రాపింగ్ సమస్యలు దేశవ్యాప్తంగా ఎక్కువవుతోన్న నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ 2018కిగాను నేషనల్ టెలికామ్ పాలసీని రిలీజ్ చేసింది. ఈ డ్రాఫ్ట్‌లో ప్రతిపాదించిన గైడ్‌లైన్స్ ప్రకారం ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్ జియో, వొడాఫోన్ వంటి లైసెన్సుడ్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు వై-ఫై ఆధారంగా స్పందించగలిగే యాప్-ఆధారిత వాయిస్ కాలింగ్ సర్వీసులను ప్రొవైడ్ చేయవల్సి ఉంటుంది.