Power Transformer in Telugu - Rock Star Computers

Breaking

Computer Hardware&Networking,Photoshop,Ms Office,Electronics,Electrical


Power Transformer in Telugu


Transformer అనేది స్థిర విద్యుత్ ని కలిగి ఉంటుంది. అది రెండు లేదా అంతకంటే ఎక్కువ సర్క్యూట్ల మధ్య విద్యుత్ శక్తిని బదిలీ చేస్తుంది.ట్రాన్స్‌ఫార్మార్ల వినియోగం విద్యుతు ఉత్పత్తి కేంద్రంలనుండి మొదలుకొని, ఇళ్ళకు, పరిశ్రమలకు విద్యుతును సరఫరా చెయ్యువరకు ఎంతో కీలకపాత్రపోషిస్తాయి.
విద్యుతు ఉత్పత్తి కేంద్రంలో మొదట తక్కువ స్దాయి వోల్ట్‌లలో విద్యుతు ఉత్పత్తి (11kv) అవుతుంది.విద్యుతు తీగెలద్వారా ప్రవహిస్తున్నప్పుడు తీగలకున్న విద్యుతు నిరోధకశక్తి (Resistant) కారణంగా కొంత విద్యుతును నష్టపోవడం జరుగుతుంది.దీనిని సరఫరా/ప్రవహ నష్టం (Transmission loss) అంటారు.
 విద్యుతు ప్రవహిస్తున్న తీగమందం, మరియు దూరాన్ని బట్టి విద్యుతు నష్టం మారును.తక్కువ వొల్టులశక్తితో విద్యుతు ప్రవహిస్తున్నప్పుడు ప్రవహ నష్టం ఎక్కువ.అందుచే విద్యుతు ఉత్పత్తి కేంద్రంలో విద్యుతు వోల్టులను 220కిలో వోల్టులు (220KV) లేదా 132కిలో వోల్టులకుపెంచెదరు. (వెయ్యి వొల్టులు ఒకకిలో వొల్టుకు సమానం) గృహలలో ఉపయోగించు విద్యుతు వోల్టులు 215-220వోల్టులు మాత్రమే వుండును.సరాఫారాలో జరుగు నష్టాన్ని తక్కించుటకై విద్యుతు ఉత్పత్తి కేంద్రాలలో (power generating units) విద్యుతు వోల్టులను 220KV/132KV కి పెంచి అక్కడినుండి, గ్రిడ్‌లకు, విద్యుతు పంఫిణి (Power distribution) మరియుసరఫరాకేంద్రాలు (power stations, ఉపకేంద్రాలులకు విద్యుతును పంపడంజరుగుతుంది.
ఇక్కడకు చేరిన విద్యుత్తు వోల్టుల స్దాయిని స్దిరికరించి పరిశ్రమలకు, గృహలకు ఇతరావసరాలకు సప్లై చేయుదురు.విద్యుతు సరాఫారా రెండురకాలు.
1.ఎక్కువ వోల్టుల విద్యుతుసరాఫరా (high tension) మరియు తక్కువ వోల్టులవిద్యుతు సరఫరా (low tension supply).గృహలకు.చిన్న పరిశ్రమలకు విద్యుతును లోటెన్సన్‌ విధానంలో (440-220 Volts) సప్లై చేయుదురు.అధికస్దాయిలో విద్యుతును ఉపయోగించు పరిశ్రమలకు హైటేన్షను పద్ధతిలో విద్యుతును సరఫరా చేయుదురు.ఈ విధంగా అవసరానికి తగువిధంగా వోల్టేజిని తగ్గించడం, పెంచడం అనేది ఈ ట్రాన్స్‌ఫార్మార్‌లద్వారానే జరుగుతున్నది.

ట్రాన్స్‌ఫార్మరులోని రకాలు:-

1)    విద్యుతు వోల్టులను పెంచు ట్రాన్స్‌ఫార్మర్ (Step up Tranformer)
2)    విద్యుతు వోల్టులను తగ్గించు ట్రాన్స్‌ఫార్మర్‌ (Step down Transformer)